Saturday, 19 April 2014

ఆశయం

ప్రతి మనిషికీ ఉంది ఆశయం
తన గమ్యం చేరాలనే ఆవేశం
జీవితంలో ఒడిదుడుకులు సహజం
ఓ నేస్తమా చెందకు నిరుత్సాహం

ఏడాది బిడ్డ పరుగులు తీసేనా?
పునాది లేనిదే భవనాలు లేచేనా?
ఆటకు తుదిమొదలు ఒకచోట ఉండునా?
ప్రయత్నం లేనిదే ఫలితం అందేనా?

ఓటమిని చూసి కుంగిపోకు
గెలవలేదని ఆశని విడవకు
నీ లక్ష్యం ఎన్నడూ మరువకు
తప్పక చేరుతావు నీ ఒడ్డుకు

No comments:

Post a Comment