Saturday, 19 April 2014

అమ్మ

 పట్టుదలకు ప్రతిబింబము నీవు
నిరాడంబరతకు నిదర్శనము నీవు
త్యాగానికి మారుపేరు నీవు
మమతల మణిదీపము నీవు
ఉరికే జలపాతము నీవు
అలుపెరుగని కెరటము నీవు
ధైర్యానికి దర్పణము నీవు
ధ్యేయ సాధనలో ముందున్నావు
మాకై మనుగడ సాగించావు
నిద్రాహారాలను సైతం మరచావు
అహర్నిశలు మాకై శ్రేమించావు
మమ్మల్ని ఈ స్థాయికి చేర్చావు
కన్నీళ్లను కనుమాటున దాచావు
కంటిపాపలా మము కాచావు
కష్టాల కడలిని దాటావు
జయకేతనం ఎగరేశావు
ప్రతిక్షణం మాకై జీవించావు
మా భవితకు ఎంతో కృషి చేశావు
ప్రాణం కంటే మిన్నగా మము ప్రేమించావు
మా అందరి హృదయం లో కొలువున్నావు

No comments:

Post a Comment