Saturday, 19 April 2014

మా మాష్టారు

ప్రతి ఉదయం చిరునవ్వుతో పలకరించారు
మా మనసులో ఆహ్లాదాన్ని నింపారు

అందరితో స్నేహంగా మెలిగారు
మాతో ఎంతో అనుబంధాన్ని పెంచుకున్నారు

సహనానికి మారుపేరు మీరు
అభినయంలో మీకు సాటి లేరు

ఎల్లప్పుడు మా మేలే కోరారు
ఎన్నో నీతి కథలను చెప్పారు

అలసట ఎరుగని కెరటం మీరు
వేడికి కరగని మేలిమి మీరు

మాకు కావాలి మీ ఆశీస్సులు
మమ్మల్ని గుర్తుంచుకుంటారు కదా ఎల్లప్పుడు

No comments:

Post a Comment