Saturday, 19 April 2014

మానవజీవితం

ఏది ఎవరికి శాశ్వతం
ఎవరు ఎవరికి శాశ్వతం
అశాస్వతమైన ఈ జీవితంపై
ఎందుకింతటి వ్యామోహం

నాటి సోదరులు పంచుకున్నారు ప్రేమానురాగాలను
వారి వారసులు పంచుకుంటున్నారు ఆస్తిపాస్తులను
డబ్బే జీవితమని భావిస్తున్నారు
కన్న తల్లిని సైతం మరుస్తున్నారు

తన,మన మరచి తన వారిని విడచి
మనీ కోసం మరమనుషుల వలె జీవిస్తున్నారు
తమదే పైచేయిగా భావిస్తున్నారు
కన్నవారిని క్షోభకు గురిచేస్తున్నారు

పుట్టినపుడు మనతో తెచ్చింది లేదు
పోయేటపుడు మనతో తీసుకెల్లేది లేదు
ఈ నిజం అందరికి తెలియంది కాదుఅయినా డబ్బుపై ఎందుకింత మోజు

యాంత్రికమైన ఈ ప్రపంచంలో యంత్రాల్లా బ్రతుకుతున్నారు
ప్రొద్దున్నే వెళ్తారు ప్రొద్దెక్కాక ఇంటికి వస్తారు
తమ పిల్లలకు సైతం ప్రేమను పంచలేకున్నారు
వారిని మందలించి మంచి మర్గాన నడిపించలేకున్నారు

No comments:

Post a Comment